ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: యూఏఈ తీరంలో ఇజ్రాయెల్‌కు చెందిన కంటైనర్ షిప్ ‘ఎంఎస్‌సీ ఏరీస్’ను ఇరాన్ నేవీ సీజ్ చేసింది. హెలికాప్టర్ ద్వారా ఆ షిప్‌ను చుట్టుముట్టిన ఇరాన్ నేవీ.. తొలుత హెచ్చరికగా కాల్పులు జరిపింది. అనంతరం ఆ నౌకను ఇరాన్ తీరం వైపుగా తీసుకెళ్లింది. ఈ షిప్‌లో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతీయుల భద్రత కోసం భారత విదేశాంగ శాఖ ఇరాన్‌తో సంప్రదింపులు మొదలుపెట్టింది.
ఇజ్రాయెల్‌లోని భారత పౌరులకు హెల్ప్‌లైన్ నంబర్లు..
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్‌లో ఉన్న భారత పౌరులకు కీలక సూచనలు చేసింది. అత్యవసర సహాయం ఉన్నవారు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఇందుకోసం ప్రజలకు ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా షేర్ చేసింది. స్థానిక అధికారులు జారీ చేసిన భద్రత ఏర్పాట్లను అనుసరించాలని కోరింది.