ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, జూన్ 6: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సందర్శించనున్నారు. ఇరిగేషన్ ఈఎన్సి అనిల్‌కుమార్, ఇతర నీటిపారుదల శాఖ అధికారుల బృందంతో కలిసి ఎన్డిఎస్ఎ మధ్యంతర నివేదిక సూచనల మేరకు కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులను చేపట్టిన ఎల్ అండ్ టీ, ఆఫ్ కాన్స్, నవ యుగ వర్క్ ఏజెన్సీలు చేపట్టిన పనులు, ప్రస్తుత బ్యారేజీల పరిస్థితిని నిర్మాణ సంస్థల టాప్ మేనేజ్మెంట్ ప్రతినిధులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించనున్నారు.
రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరదల నేపథ్యంలో చేపడుతున్న రక్షణ పనులను ఈ సందర్భంగా మంత్రి సమీక్షించనున్నారు.బ్యారేజి పరిస్థితి,వాటి మరమ్మతుల ప్రోగ్రెస్ గురించి రేపు మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. చాపర్ ద్వారా సుందిల్ల కు చేరుకొని మధ్యాహ్నం 1 గంటల వరకు సుందిల్ల బ్యారెజీని పరిశీలిస్తారు. అనంతరం అన్నారం చేరుకొని బ్యారేజి పరిశీలన, అక్కడి నుండి మేడిగడ్డ బ్యారేజి వెళ్తారు.