సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు..
ప్రతిపక్షం, నకిరేకల్: ప్రస్తుత రాజకీయాల్లో కమ్యూనిస్టులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక మేకల లింగయ్య స్మారక భవనంలో శనివారం జరిగిన సీపీఎం చిట్యాల మండల జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సీపీఎం అభ్యర్థి యండి జహంగీర్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత 30 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, కార్యకర్తగా పనిచేస్తున్న జహంగీర్ ను పార్లమెంటుకు పంపించాలని కోరారు.
చరిత్రను వక్రీకరించి మతాల పేరు మీద, ప్రజల మధ్య ఘర్షణ వాతావరణ సృష్టించే బీజేపీని ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి, ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా కోట్లాది రూపాయలు పొందిన బీజేపీ విధానాల్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు. దేవుడి పేరు మీద రాజకీయాలు చేస్తున్న మోడీ విధానాలు చూసి ప్రజలు అవాక్కగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్లో గొంతు విప్పే కమ్యూనిస్టు అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం మండల కార్యదర్శి అరూరి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, పార్టీ సీనియర్ నాయకులు పావనుగుల్ల అచ్చాలు, శీలా రాజయ్య, పార్టీ మండల కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, ఐతరాజు నరసింహ, కల్లూరి కుమారస్వామి, లడే రాములు, మెట్టు నరసింహ, గుడిసె లక్ష్మీనారాయణ, మేడి సుగుణమ్మ, మెట్టు పరమేష్, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, అరూరి శంభయ్య, కందగట్ల గణేష్, నకిరేకంటి రాములు, డి.లింగస్వామి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.



























