Hyderabad: నిమజ్జనాలకు అనుమతి లేదంటూ.. హుస్సేన్‌సాగర్‌ వద్ద వెలిసిన ప్లెక్సీలు..

Plexiglas exposed at Hussainsagar: తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలను పిల్లా, పెద్ద అందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఇక హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ప్రాంతం నిమజ్జనాలకు పెట్టింది పేరు.. ఏటా హుస్సేన్ సాగర్ లో కొన్ని వేల సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఇప్పటికే అక్కడ నిమజ్జనాలు సైతం ప్రారంభమయ్యాయి. అయితే ఇవాళ ఉదయం అక్కడ వెలిసిన కొన్ని ప్లెక్సీలు.. విగ్రహాలు ఏర్పాటుచేసిన వారిని షాక్‌కి గురిచేశాయి. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ అక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్‌బండ్‌ మార్గంలో జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ పోలీసుల పేరిట ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదని అందులో పేర్కొన్నారు.

Spread the love

Related News