Trending Now

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పడం ఖాయం..

సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 08: డబ్బులు ఉన్నాయాన్న అహంకారంతో మాజీ సిద్ధిపేట కలెక్టర్, ఎమ్మెల్సీ, మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ లొంగదీసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గుట్టు చప్పుడు కాకుండా సమావేశం నిర్వహించడం ఏమిటని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్ మండిపడ్డారు. సిద్ధిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆదివారం రాత్రి వివిధ శాఖల అధికారులతో బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి రహస్యం సమావేశం నిర్వహించారని అన్నారు. సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహించిన వెంకట్రామిరెడ్డి పరిచయం ఉన్న అధికారులకు అందరికీ ఫోన్ చేసి సమావేశం నిర్వహించి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు దొంగ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయం తెలుసుకున్నసిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులతో రహస్య సమావేశం జరుగుతుంటే నిఘా ఉంచాల్సిన ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారని అన్నారు. విషయాన్ని సిద్దిపేట ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డిఓ దృష్టికి తీసుకువెళ్లిన కనీసం స్పందించలేదని అన్నారు. కొందరు ప్రభుత్వ అధికారులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఇలాంటి చర్యలు పాల్పడడం మంచిది కాదని అన్నారు. సిద్దిపేటకు చెందిన మీడియా మిత్రులు కవరేజ్ చేయకుండా పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడంతో పోలీసులు రెడ్డి ఫంక్షన్ హాల్ లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని తీసుకొని పరిశీలిస్తున్నారని అన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ లో సుడా మాజీ చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి ఓట్లు దండుకునేందుకు అధికారులను ప్రభావితం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారని తెలుసుకొని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ వాహనాలను అక్కడే విడిచి గోడలు దుంకి పారిపోయారని అన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేలా కోరుతామని అన్నారు. రహస్య సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ఐకెపి ప్రభుత్వ ఉద్యోగులకు ఓట్లు వేస్తే వారికి 50 వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చినట్లు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు చెప్పారని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన ఇంకా సిగ్గు రాలేదని అన్నారు. డబ్బు ఉందని తాను జిల్లా కలెక్టర్ గా అధికారిని అని ఇంకా ఆలోచిస్తూ అహంతో ముందుకు వస్తున్న వెంకటరామిరెడ్డికి ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. రిజర్వాయర్ల పేరిట భూనిర్వాసితులకు అన్యాయం చేసిన వెంకటరామిరెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. వరి ఏస్తే ఊరేనని చెప్పిన వెంకటరామిరెడ్డి ఏం మొహం పెట్టుకుని రైతుల వద్దకు వెళ్తారని అన్నారు. డబ్బుతో ఓట్లను కొనాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని వెంటనే పోటీ నుంచి ఎన్నికల సంఘం అధికారులు తొలగించాలని డిమాండ్ చేశారు. రహస్య సమావేశం నిర్వహించి ఓట్లు కొనాలని చూస్తున్న వెంకటరామిరెడ్డి మారెడ్డి రవీందర్ రెడ్డి లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆర్డీవో కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట యువజన పట్టణ అధ్యక్షులు గయాజుద్దీన్ నజ్జు, అశోక్ రమేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News