Trending Now

మోడీ మోసాలు ఇక చెల్లవు..

కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 10 : పదేళ్ల నుంచి అనేక మోసాలు చేస్తూ.. భారతీయులందరిని మోసగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం ఎల్లాపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తేనే అన్ని వర్గాలకు సమన్యాయం సమసంక్షేమం జరుగుతుందని పేర్కొన్నారు. పదేళ్ల బిజెపి పాలనలో దేశ ప్రజలు ఆందోళనకరమైన పరిస్థితులను ఎదుర్కున్నారన్నారు. సంక్షేమం గురించి అసలుకే పట్టించుకోని బిజెపి కులాలు, మతాల పేరిట రెచ్చగొడుతూ చిచ్చు చేసుకుంటా సంక్షేమం గురించి అసలుకే పట్టించుకోని బిజెపి కులాలు, మతాల పేరిట రెచ్చగొడుతూ భారతీయుల మధ్య చిచ్చు పెడుతూ వచ్చిందని ఆరోపించారు. భారత్ జూడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ 4వేల కిలోమీటర్లు తన పాదయాత్ర ద్వారా దేశంలోని అన్ని వర్గాల సమస్యలు ఇతరత్రా విషయాల పట్ల అవగాహన పెంచుకున్నారన్నారు. కాంగ్రెస్ భారత్ జోడో నినాదంతో ముందుకు వెళ్తుండే బిజెపి భారత్ చోడో నినాదంతో కొన్ని సామాజిక వర్గాలను భయాందోళనలకు గురి చేస్తున్నదని ఆరోపించారు.

శాసనసభ ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటిని దశలవారీగా నాలుగు నెలల లోనే అమలు చేసిన ఘనత దక్కిందని చెప్పారు. అదే మాదిరి కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలనుంటిని వంద శాతం అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పదేళ్ల మోడీ పాలనలో ధనికులే అభివృద్ధి చెందారు తప్ప దేశ సామాన్య పేదరిక ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీలకు మాత్రం దక్కింది ఏమీ లేదని చెప్పారు. ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని తొలగించేందుకు బిజెపి కుట్రలు పొందుతూ ఉండడం ఆందోళనలు కలగజేస్తుంది అన్నారు. అదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న బిజెపి మీ,బీఆర్ఎస్ అభ్యర్థులు గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా పదవులు అనుభవించిన వారే కానీ అభివృద్ధిని మాత్రం చేయలేదని ఎద్దేవా చేశారు. పేదింటి ఆడబిడ్డ ఆదివాసి ప్రజా సమస్యలపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. సమిష్టి కృషితోనే కాంగ్రెస్ ఎంపీ సీటును సాధించడం సులభం అవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ ఆయిర నారాయణరెడ్డి ,పీసీసీ మాజీ సభ్యులు రామలింగం, ఎఫ్ ఏ సి ఎస్ మాజీ చైర్మన్ ధర్మాజీ గారి రాజేందర్, అల్లోల సురేందర్ రెడ్డి,ముడుసు సత్యనారాయణ, ముత్యం రెడ్డి తాజా మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి, పాకాల రామచందర్, అనుముల భాస్కర్ ,అమరవేణి నర్సా గౌడ్ పలువురు ఎంపీటీసీలు తాజా మాజీ సర్పంచులు,వార్డు సభ్యులు ,కాంగ్రెస్ ఆయా విభాగాల పదాధికారులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News