Trending Now

షర్మిల వియ్యంకురాలి హోటల్ ‘చట్నీస్’లో ఐటీ రెయిడ్స్..

హైదరాబాద్‌, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం రేపాయి. ప్రముఖ అల్పాహార ఫ్రాంచైజీ చట్నీస్‌ హోటల్స్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హోటళ్లతోపాటు వాటి యజమాని ఇండ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సంస్థ యజమామని అట్లూరి పద్మ.. ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌ షర్మిలకు వియ్యంకురాలు కావడం గమనార్హం. ఇటీవలే షర్మిల కుమారుడు రాజారెడ్డితో అట్లూరి పద్మ కుమార్తెకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. అదేవిధంగా హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న మేఘనా ఫుడ్స్‌ ఈటరీస్‌లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. నగరంతోపాటు బెంగళూరులోనూ ఈ ఫ్రాంచైజీలు ఉన్నాయి. అయితే ఈ దాడులకు సంబంధించి హోటళ్ల యజమానులతోపాటు ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Spread the love

Related News

Latest News