ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 30 : తనిఖీ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద్ ఆదేశించారు. జిల్లాలోని చించోలి (బి), గంజాల్, కొండాపూర్ లలో గల తనిఖీ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. తనిఖీ చేసే అన్ని వాహనాలను వీడియో రికార్డింగ్ చేయాలని అన్నారు. అనుమతి పత్రాలు లేని 50 వేలకు మించి నగదును సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలపై ప్రజలకు ఏవైనా ఫిర్యాదులు, సందేహాలు గాని ఉన్నట్లయితే తన మొబైల్ నంబర్ 8143876383 కు సంప్రదించవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఆదిలాబాద్ లోని పెన్ గంగా అతిథి గృహంలో ప్రతీరోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో నేరుగా కలిసి ఫిర్యాదులు సమర్పించవచ్చని తెలిపారు.