Chandrababu criticizes Jagan: తిరుమల లడ్డూ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని, వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఆయన ‘చిట్ చాట్’లో మాట్లాడారు. తిరుమల పవిత్రతకు పూర్వవైభవం తీసుకొస్తామని తెలిపారు. ‘తిరుమలకు 200 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. ఇంట్లో స్వామి వారి లడ్డూ ఉంటే ఇళ్లంతా ఘుమఘులాడే వాసన వచ్చేది. అంతటి పవిత్రత, విశిష్టత ఉన్న లడ్డూను కల్తీ చేయడమే కాక జగన్ ఎదురుదాడి చేస్తారా? ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి మార్చుకోరా..?’ అని దుయ్యబట్టారు. స్వామి వారి అన్న ప్రసాదం స్ఫూర్తితోనే అన్న క్యాంటీన్లు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.



























