ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. నర్సాపూర్‌లో జగ్గారెడ్డి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జగ్గారెడ్డి తో పాటు ప్రదర్శనలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే చేసి తీరుతుంది.. ఆర్టీసీ బస్‌లలో మహిళలకు ఉచిత ప్రయాణాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఉచితం గా ఇస్తున్నాం.. వంద రోజుల పాలనలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అద్భుతాలు చేశారన్నారు.
మనమంతా కష్టపడి నర్సాపూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ ను నెంబర్ 1 స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. 20 వేలు మెజారిటీ తెస్తే ఇక్కడ నియోజక వర్గంలో అవసరమైన అన్ని పనులు జరుగుతాయి. 50 వేలు మెజారిటీ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెవుతున్నారు. ఇక్కడ 50 వేల మెజారిటీ తెస్తే ఇక్కడ నియోజక వర్గానికి ఏమి కావాలో నేనే దగ్గర ఉండి చేయిస్తానని పేర్కొన్నారు. కేసీఆర్ పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్లు పేదలందరికీ కట్టి ఇస్తుంది. దళిత, గిరిజన కుటుంబాలకు 6 లక్షలతో, ఇతరులకు 5 లక్షల రూపాయలతో ఇళ్ళు కట్టిస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో తప్పదు.. ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తామని.. అన్ని వస్తాయి. మీరు నిరుస్తాహపడోద్దని జగ్గారెడ్డి తెలిపారు.