Trending Now

తీన్మార్​ మల్లన్న ఆఫీస్​లో కాల్పులు

కార్యాలయంపై దాడికి దిగిన ‘జాగృతి’ కార్యకర్తలు

గాలిలోకి కాల్పులు జరిపిన గన్​మెన్​

ప్రతిపక్షం, హైదరాబాద్​:

నగర శివారు మేడిపల్లిలో ఉన్న తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కొద్దిసేపటి క్రితం జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. అక్కడ ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ కార్యాలయంలోకి ప్రవేశించడానికి యత్నించారు. పరిస్థితి తీవ్రతను గమనించిన సిబ్బంది లోపల నుంచి తలుపులు మూసుకున్నారు. అయినా ఆందోళనకారులు లోపలికి చొచ్చుకు రావడానికి యత్నించడంతో తీన్మార్ మల్లన్న గన్మెన్ గాలిలోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్టు జరిపినట్టు తెలిసింది.

తెలంగాణ జాగృతి నాయకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జాగృతి కార్యకర్తలు జవహర్ నగర్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఈ దాడి చేసినట్టు సమాచారం. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆందోళనకారులను అక్కడ నుంచి పంపించి వేస్తున్నారు.

Spread the love

Related News