Jammu and Kashmir Assembly Elections: దాదాపు 10 సంవత్సరాల తర్వాత జమ్మూ కశ్మీరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 90 అసెంబ్లీ నియోజక వర్గాలుండగా.. తొలి దశలో 24 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 23 లక్షల మంది ఓటర్లు ఈ విడతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కశ్మీర్‌లో 16, జమ్ములో 8 స్థానాల్లో 3 వేల 276 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, ఎల్‌వోసీ దగ్గరున్న పోలింగ్ స్టేషన్ల దగ్గర అదనపు బలగాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసులతో పాటు అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలను ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారు.