Trending Now

Jammu & Kashmir elections: నేడు జమ్మూకశ్మీర్‌లో రెండో విడత పోలింగ్

Jammu & Kashmir elections 2024: జమ్మూకశ్మీర్‌లో ఇవాళ రెండో విడత పోలింగ్‌ జరగనుంది. మొత్తం 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. గదర్బాల్, గరీబ్బల్, బుద్గాం , బీర్వా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 25.78 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 239 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. అలాగే 3,502 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది.

రెండో దశ ఓటింగ్‌లో జమ్మూ ప్రాంతంలోని 3 జిల్లాలు, కాశ్మీర్ ప్రాంతంలోని 3 జిల్లాలు ఉన్నాయి. ఇందులో
ప్రధానంగా బ్లాక్ (ఎస్టీ), గదర్బాల్, గరీబ్బల్, ఖన్యార్, హబ్బకదల్, లాల్ చౌక్, చన్నపొర, జడిబాల్, ఈద్గా ఉన్నాయి. సెంట్రల్ షాల్తెంగ్, బుద్గాం, బీర్వా, ఖాన్‌సాహిబ్, చరర్-ఎ-షరీఫ్, చదూరా, గులాబ్‌ఘర్ (ఎస్టీ), రియాసి, శ్రీ మాతా వైష్ణో దేవి, కలకోటే-సుందర్‌బాని, నౌషేరా, రాజ్‌సౌరి (ఎస్టీ), బుధాల్ (ఎస్టీ), తన్నమండి (ఎస్టీ), సురన్‌కోట్ (ఎస్టీ), పూంచ్ హవేలీ మెంధార్ (ఎస్టీ) పవర్ జోన్‌లు ఉన్నాయి.

Spread the love

Related News

Latest News