ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి చప్పట్లతో అభినందించారు. మంత్రిగా పవన్‌కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వేదికపై ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి ఆనందంతో ఉప్పొంగిపోయారు.
“కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను” అనగానే సభ ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. దాదాపు 10 సంవత్సరాల పాటు కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని.. ఇన్ని సంవత్సరాలు వేచి చూసిన అభిమానుల కల నెరవేరిన వేళ పవన్ ఫ్యాన్స్ తో పాటు కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు ఆనందంలో మునిగి పోయారు.