YCP Leaders Joining Janasena Party: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి(ఒంగోలు) జనసేనలో చేరారు. ఆయనతోపాటు సామినేని ఉదయభాను(జగ్గయ్యపేట), కిలారి రోశయ్య(పోన్నూరు) కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు వారందరికీ జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే విధంగా వారి వెంట కార్యకర్తలు సైతం భారీగా తరలివచ్చారు. ఈ మేరకు వారు సైతం జనసేన తీర్థం పుచ్చుకున్నారు.