ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. విజయవాడలో వీరిద్దరూ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ బైజయంత్ పండా పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరిన నేపథ్యంలో ఇరు పార్టీలు పోటీ చేసే స్థానాలు, అభర్థులపై వీరు చర్చించిన్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను కేటాహించినట్లు సమాచారం. ఇందులో బీజేపీకి 6 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలు కేటాయించినట్లు టాక్.