ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దూసుకెళ్తున్నారు. జనసేన చీఫ్ 20 వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి వంగా గీత పోటీలో ఉన్న విషయం తెలిసిందే. జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. 18 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఇక పవన్ కల్యాణ్‌కు భారీగా లీడ్ వస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌గా ఉన్నారు.