Trending Now

Jay Shah: ఐసీసీ కొత్త చైర్మన్‌గా జై షా

Jay Shah has been elected Chair of the ICC: బీసీసీఐ కార్యదర్శి జై షాకు కీలక పదవి వరించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొత్త చైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1న ఆయన పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. అయితే అతి చిన్న వయస్సులో ఐసీసీ చైర్మన్‌గా జై షా(35) ఎన్నికై అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు.

ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా గ్రెగ్ బార్క్‌లే కొనసాగుతున్నారు. ఈయన పదవీ కాలం నవంబర్ 30న ముగియనుంది. అయితే మరోసారి ఆ పదవి చేపట్టేందుకు ఆయనకు అర్హత ఉన్నప్పటికీ..విముఖత చూపించారు. దీంతో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికైన ఐదో వ్యక్తిగా జై షా నిలిచారు.

Spread the love

Related News

Latest News