Former Jharkhand CM Champai Soren resigns from JMM: ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ జేఎంఎం(ఝార్ఖండ్ ముక్తి మోర్చా)కు రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు లేఖ విడుదల చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. ఆగస్టు 30న హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు.
కాగా, నవంబర్‌లో ఝార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంపై సోరెన్ రాజీనామా చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిన సమయంలో చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత సీఎం బాధ్యతల నుంచి చంపై వైదొలగడంతో హేమంత్ సోరెన్ మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టారు.