ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకమయ్యారు. ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. కాగా, తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన గతంలో బీజేపీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.