కాంగ్రెస్ కండువా వేసి ఆహ్వానించి డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 26 : నిర్మల్ కాంగ్రెస్‌లో చేరికలపర్వం జోరుగానే కొనసాగుతూ ఉంది. నెల రోజులుగా నిర్మల్ నియోజకవర్గం లోని పలు మండలాలు పట్టణానికి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఇప్పటికే కాంగ్రెస్ కండవాలు కప్పుకున్నారు. ఇందులో 90 శాతానికి పైగా మంది రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అనుచరులే అభిమానులు కాంగ్రెస్లో చేరడం గమనార్హం. తాజాగా శుక్రవారం నిర్మల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గోపి, అరుణ్ కుమార్, ధర్మాజీ గారి శ్రీనివాస్ లతోపాటు పలువురు ఆయా విభాగాల బీజేపీ వీఆర్ఎస్ పదాధికారులు, నాయకులు కాంగ్రెస్లో చేరారు. వారికి నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు కాంగ్రెస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఇటీవల కాంగ్రెస్ కేంద్ర అధిష్టానం ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, నిర్మల్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ మున్సిపల్ మాజీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అయ్యన్న గారి పోశెట్టి, సోన్ మండల కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ మోయినుద్దీన్, మున్సిపల్ కౌన్సిలర్లు సమందర్ పెల్లి రాజు, కొట్టే శేఖర్, గాజుల రవి, ఆకుల నర్సయ్య, అరవింద్ కుమార్ జి.ప్రశాంత్, కొంతంగణేష్, మాజీ సర్పంచ్ భీమ్ రెడ్డి రమణారెడ్డి, వడ్నం రాజేశ్వర్ బురాజ్, ప్రతాపరెడ్డి లు చేరారు.