Trending Now

పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి..

ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలి..

జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 4 : పార్లమెంట్ ఎన్నికలకు మరో పది రోజుల గడువు ఉందని ప్రతి కార్యకర్త కష్టపడి పని చేసి, ఆదివాసి ముద్దుబిడ్డ ఆత్రం సుగుణను పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హోటల్ మారుతిలో డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అధ్యక్షతన నిర్మల్ నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా ఆదివాసి ముద్దుబిడ్డ ఆత్రం సుగుణకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారని అన్నారు. ప్రతి గ్రామం నుండి భారీ మెజార్టీ రావడానికి నాయకులు కష్టపడి పని చేయాలని కోరారు. మహిళ అభ్యర్థిని పార్లమెంటుకు పంపిస్తే ఉమ్మడి జిల్లా ఎంతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
నిర్మల్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇచ్చినట్లయితే శ్రీహరి రావు మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు.

ఇంటింటికి వెళ్లి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మతతత్వ విధానాలు వివరించాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో రాష్ట్రానికి చేసింది ఏమి లేదని, అలాంటి పార్టీని నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, టీపీసీసీ కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఏఐసీసీ కార్యదర్శి నరేష్ జాదవ్, జడ్పీటీసీలు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, జాదవ్ సోనియా సంతోష్, ఎంపీపీలు రమేష్, అమృత జైసింగ్, అడే సవిత, రామేశ్వర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, సారంగాపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అర్జుమాన్ అలీ, దశరథ్ రాజేశ్వర్, పీసీసీ సభ్యులు సాధ రాజేశ్వర్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు ఎంబడి రాజేశ్వర్, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడుఎంబడి రాకేష్, పట్టణ అధ్యక్షులు నాందేడపు చిన్నూ, కౌన్సిలర్ లు తారక రఘువీర్, నల్లూరి పోశెట్టి, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News