Trending Now

కాళేశ్వరంపై జ్యుడిషియల్​ విచారణ..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారెజీల కుంగుబాటుపై త్వరలోనే జ్యుడిషియల్​ విచారణ చేయనున్నట్లు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి తెలిపారు. బుధవారం జలసౌధలో మీడియా ప్రతినిధులతో చిట్​చాట్​ చేస్తూ.. బ్యారేజి డ్యామేజీకి గల కారణాలు చెప్పాలన్నారు. సమస్యకు కారణం ఎవరు అనేది నిర్మాణ సంస్థను అడిగామని తెలిపారు. అయితే అందుకు సంస్థ ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు. వర్షాకాలానికి ముందే దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, బ్యారేజీల మరమ్మత్తులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సాధ్యాసాధ్యాలు చెప్పాలన్నారు. అయితే కేంద్ర సంస్థ అయిన ఎన్​డీఎస్​ఏ కమిటీకి పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న అన్నిడాక్యుమెంట్స్ ఎన్​డీఎస్​ఏ కమిటీ కి ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఎవరైనాఎన్​డీఎస్​ఏ కమిటీ కి సహకారం ఇవ్వకపోతే, డాక్యుమెంట్స్ దాచితే కటినమైన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్​ హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకే ఎన్​డీఎస్​ఏ కమిటీ వచ్చినట్లు చెప్పారు. గురువారం ఉదయం మెడిగడ్డ, అనంతరం అన్నారం, రాత్రి రామగుండం 8న సుంధిల్ల బ్యారేజి ఆ కమిటీ పరిశీలిస్తుందన్నారు. టెస్టుల కోసం ప్రపంచంలో ఎంత అత్యాధునిక టెక్నాలజీ వాడాలని సూచించామన్నారు. రిపేర్ చేసి మళ్ళీ అందుబాటులోకి వస్తె రాష్ట్రానికి మంచిదేనన్నారు. అయితే వర్షాకాలానికి ముందే అందుబాటులోకి వస్తె మరీ మంచిదదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇఎన్​సీ నాగేందర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ పరిశీలన పూర్తి చేసుకుంటుందని తెలిపారు. ఎన్​డీఎస్​ఏ ప్రాథమిక రిపోర్ట్ రాగానే తప్పులు ఉంటే నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటాంమన్నారు. ల్యాండ్​ టి రాష్ట్రంలో అనేక వ్యాపారాలు చేస్తోంది. మేము చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

Spread the love

Related News

Latest News