ప్రతిపక్షం, జుక్కల్ : జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలో సోమవారం దుబాయ్ రాజు కు చెందిన నూతన టీవీఎస్ షోరూంను స్థానిక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో టీవీఎస్ షోరూంను ప్రారంభం చేయడం చాలా గొప్ప విషయమని, తద్వారా కొంతమందికి ఉపాధి కలుగుతుందని, దుబాయ్ రాజు ను ప్రశంసించారు. అనంతరం దుబాయ్ రాజు శాలువా కప్పి ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు ను సన్మానించారు. అనంతరం షోరూంలో ఏ ఏ వెరైటీల ద్విచక్ర వాహనాలు ఉన్నాయని పరిశీలించారు. అనంతరం కొనుగోలు చేసిన వినియోగదారునికి ద్విచక్ర వాహనాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.