Trending Now

గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతి రావు పూలే..

ప్రతిపక్షం, షాద్ నగర్: ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మా మహాత్మా ఫూలే జయంతి సందర్భంగా షాద్ నగర్ ఎంపీడీవో కార్యాలయం ముందు ఉన్న మహాత్మ జ్యోతి రావు పులే విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతి రావు పూలే గొప్ప సామాజిక వేత్త, సంఘ సంస్కర్త అని స్త్రీ విద్య కోసం అనేక పోరాటాలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ సైతం ఫూలే జీవితం, కృషి, బోధనలతో స్ఫూర్తి పొందారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన సంస్కర్త, కవి, రచయిత, విమర్శకుడు మహాత్మా ఫూలే ఆలోచనలను, ఆచరిస్తూ, ఆయన ఆశయాలను సాధించడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు ఎం.రాంబల్ నాయక్, బీసీ సంక్షేమ సంఘం దక్షణ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మద్దూరి అశోక్ గౌడ్, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్, పినపాక ప్రభాకర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు నర్సింలు, బీఎస్పీ నాయకులు ప్రశాంత్, టిఎల్ఎఫ్ నాయకులు కరుణాకర్, టీవీవీ నాయకులు శ్రీనివాస్, యూటీఎఫ్ నాయకులు నర్సింలు, దళిత సంఘాల నేతలు టెలిఫోన్ వెంకటయ్య, జనార్ధన్, బీసీ సంఘం నాయకులు రాములు గౌడ్, రాజు గౌడ్, దళిత విద్యార్థి నాయకులు జాంగారి రవి, మాల మహానాడు నాయకులు మల్లేష్, బీసీ నాయకులు రాజేందర్, clc నాయకులు తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News