ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కల్కి 2898AD మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. 4 రోజుల్లో ₹555 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. హిందీ వెర్షన్ రికార్డు స్థాయిలో ₹115 కోట్లు సాధించినట్లు చెప్పారు. US, కెనడాలో $11 మిలియన్లు (₹91.81 కోట్లు) కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. UKలో ₹9.38 కోట్లు, ఆస్ట్రేలియాలో ₹9 కోట్లు, జర్మనీలో ₹1.30 కోట్లు, న్యూజిలాండ్ లో ₹93 లక్షలు వసూలు చేసినట్లు తెలిపాయి.