ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కల్కి’ మూవీ కలెక్షన్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టినట్లు వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. శనివారం వరకు ఈ చిత్రం రూ.415 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అమితాబ్, కమల్, దీపిక వంటి స్టార్లు కీలక పాత్రలు పోషించారు.