ప్రతిపక్షం, ప్రతినిధి నిజామాబాద్, జులై 04 : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గ్రీన్ కార్ప్ ఆధ్వర్యంలో భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువు స్థాపకత అనే అంశాలపై నిర్వహించిన పోటిలో కంజర గ్రామం విద్యార్థి రాచర్ల సాహితికి ప్రథమ బహుమతి లభించింది. గురువారం జిల్లా కేంద్రంలోని శంకర్ భవన్ పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి కవితల పోటీల్లో మోపాల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంజర కు చెందిన 8వ తరగతి విద్యార్థిని రాచర్ల సాహితి జిల్లా స్థాయి ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపాలచారి ప్రతిభ చూపిన సాహితిని, శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు అరుణశ్రీ, గోపాలకృష్ణలను అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి, ఎంఎస్ రాణి, కాంతికిరణ్, ఉమాగౌరి, భూమయ్య, విజయలక్ష్మి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.