Pawan Kalyan Question in KBC: 16వ సీజన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. 2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు?’ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అని అడిగారు. కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్ పోల్’ ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్‌లో 50 శాతం మందికి పైగా పవన్ కల్యాణ్ అని చెప్పారు. దీంతో వారు పవన్ పేరు చెప్పి లాక్ చేయగా.. కంటెస్టెంట్ రూ.1.60లక్షలు గెలుచుకున్నారు.
కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍కు చెందిన జనసేన పార్టీ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ చోట గెలిచింది. 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని అద్భుత విజయంతో రికార్డులకెక్కింది. అనంతరం ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కల్యాణ్ పదవి చేపట్టారు. దీంతో దేశ రాజకీయాల్లోనూ ఆయన పేరు మార్మోగిపోతోంది. మరోవైపు కేంద్రంలోనూ కీలకంగా మారారు.