ప్రతిపక్షం, వెబ్ డెస్క్: నిజమైన మార్పు కోసం కుటుంబ పార్టీలకు చరమ గీతం పాడాలని బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని.. వీటికి ఎంఐఎం జత కలిసిందని విమర్శించారు. ఈ మూడు పార్టీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ కేటీఆర్ ను సీఎం చేయాలని చూస్తే.. కాంగ్రెస్ రాహుల్ ను పీఎం చేయాలని చూస్తోందన్నారు. బీజేపీ ఒక్కటే ప్రజల కోసం పని చేస్తోందన్నారు.