ప్రతిపక్షం, జగిత్యాల, ఏప్రిల్ 26: జగిత్యాల జిల్లాలో బహుజన సమాజ్ పార్టీకి కీలక నేతలు రాజీనామా చేశారు. జగిత్యాల బీఎస్పీ పార్టీ ఇంచార్జి మద్దెల నారాయణ, దేవ్ సింగ్ రాథోడ్ లు రాజీనామా సమర్పించారు. ఈ మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యకులు మంద ప్రభాకర్ కు రాజీనామా లేఖలను శుక్రవారం పంపిన్నట్లు వారు తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు వారు లేఖలో పేర్కొన్నారు. మద్దెల నారాయణ జగిత్యాల జిల్లాలో బీఎస్పీ పార్టీ బలోపేతానికి పాటుపడడమే కాకుండా జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. నిస్వార్థంగా ప్రజాసేవా చేయాలనే లక్ష్యంతో మండల విద్యాధికారిగా పదవీ విరమణ చేసిన తర్వాత బీఎస్పీలో చేరి.. జిల్లాలో అన్ని తానై వ్యవహరించి పని చేశారు. ఎంపీ ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.