మామడలో కీ.శే. కూచాడి సత్యమ్మ ప్రకాష్ రావు ప్రాథమిక నేత్ర పరీక్ష కేంద్రం
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 3 : మానవసేవయే మాధవసేవ అని ఆపత్కాలంలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఈ తరహ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్మల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచాడి చాడి శ్రీహరిరావు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో కీ.శే. సత్తెమ్మ ప్రకాశరావు ప్రాథమిక నేత్ర పరీక్ష కేంద్రం వార్షికోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రుల స్మారకార్థం ఏడాది క్రితం ఈ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగిందని.. దీని ద్వారా అన్ని వర్గాల ప్రజలు తగిన విధంగా లబ్ధి పొందుతుండడం తనకు ఎంతగానో సంతోషంగా ఉందని చెప్పారు.
ఏడాది కాలంలో వైద్య సేవా కార్యక్రమాలు ఉచిత శిబిరాలు నిర్వహించి ఆపత్కాలంలో ఉన్న వారిని ఆదుకునేందుకు భగవంతుడు తనకు సహకరిస్తున్నందుకు రుణపడి ఉంటాను అని చెప్పారు. జెసి కన్వీనర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొట్టే శేఖర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల స్మారకార్థం ఇతర సేవా కార్యక్రమాలు మండల కేంద్రంలో నిర్వహిస్తూ.. ముందుకెళ్తున్న కూచాడి శ్రీహరి రావు వారి సోదరులకు సమాజం ఎప్పుడూ రుణపడి ఉంటుందని చెప్పారు. బాధ తప్ప హృదయాలతో తల్లిదండ్రులను స్మరించుకునే సమాజ ఇతర సేవ కార్యక్రమాలను ఎంచుకొని అర్హులైన నిరుపేద, బడుగు, బలహీన మైనార్టీ వర్గాల వారు ఆయా రోగాల బారి నుండి తమను తాము కాపాడేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేయడం మహోన్నతమైన అవకాశంగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, అడ్మినిస్ట్రేటర్ సందీప్ దయాల్, విజన్ సెంటర్ కో ఆర్డినేటర్ ఓం ప్రకాష్, సాయన్న గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.