Trending Now

‘అప్పుడే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు’.. కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఎన్నికలు ముగిశాయి.. కిషన్ రెడ్డి గారు డిల్లీ వెళ్లి విపత్తు నిర్వహణ నిధులు తీసుకురండి. అప్పుడే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మధ్య కాలంలో అనేక అభియోగాలు మా మీద మోపారు.. భాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. కరవుతో ప్రజలకు ఆపద వచ్చినప్పుడు రైతులకు, రైతు కూలీలకు.. గ్రామీణ ప్రాంతాల పేదలు ఎన్ని కష్టాలు ఉన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్తితులు.. ఒక్క సారి కూడా సమీక్ష మీరు నిర్వహించలేదు. తెలంగాణ లోని జిల్లాల్లో, మండలలో తీవ్రమైన కరువు ఏర్పడింది. భూగర్భ జలాలు అడుగంటిపోయి.. బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు, రైతు కూలీలకు ఉపాధి కరువైంది. సీఎం రేవంత్ రెడ్డి గారు త్రాగు నీటికి ప్రజలకు ఇబ్బందులు రాకుండా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు చేశారు. ఇలా అనేక ప్రయత్నాలు మేము చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో 97 మంది పకృతి విపత్తు తో మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా.. మీరు ఏనాడూ ప్రధానికి లేఖ రాయలేదు. ఓట్ల కోసం ఆరాటం తప్ప ప్రజల కోసం ఆలోచన చేయడం లేదు. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కరువు వచ్చింది. మహబూబ్ నగర్, నల్గొండ లలో తీవ్ర కరువు వస్తే.. ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక బృందాన్ని పంపి 28 వందల కోట్లు రాష్ట్రానికి పంపారని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం కరువు వచ్చినప్పుడు రాష్ట్రానికి రెండు రూపాయలు కూడా ఇవ్వలేదు. కిషన్ రెడ్డి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాడు. GST విధానం వచ్చినప్పుడే వ్యవసాయ పరికరాలు మీద, ఎరువుల మీద GST వేయకండి అని లేఖ రాశాం. చివరకు డ్రిప్ ఇరిగేషన్ మీద కూడా GST విధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే రెవెన్యూ శాఖ మంత్రికి లేఖ రాశాం వాళ్ళు ఏం ప్రయత్నాలు చేశారో తెలియదు. రైతులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడమేకాక నల్ల చట్టాలు తీసుకువచ్చారు. వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పిన వినలేదు. తీవ్ర వ్యతిరేకత వచ్చినా తర్వాత, 7 వందల మంది రైతులు చనిపోయిన తర్వాత.. నల్ల చట్టాలు ఉపసంహరణ తీసుకుంటున్నాం అని ప్రకటించారు.

Spread the love

Related News

Latest News