Trending Now

సుశీల్‌ కుమార్‌ మోదీ మృతి.. స్పందించిన కిషన్ రెడ్డి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ (72) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించి సోమవారం (మే 13) రాత్రి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. ఈ మేరకు సుశీల్‌ కుమార్‌ మోదీ మరణ వార్తను బీజేపీ అధికారికంగా ధృవీకరించింది. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ పార్టీ రాష్ట్ర యూనిట్ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. సుశీల్‌ కుమార్‌ మోదీ మరణం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రజా జీవితంలో చిత్తశుద్ధి, పారదర్శకత గల నేతగా అందరికి ఆదర్శంగా నిలిచిన నిజాయితీ గల ఓ ఆత్మీయ మిత్రుడిని కోల్పోయాను. సుశీల్ జీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో నిబద్ధత కలిగిన స్వయంసేవక్. ఏబీవీపీ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్ లో బీజేపీ విస్తరణకు కృషి చేసిన వారి మరణం పార్టీకి తీరనిలోటని తెలిపారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

Spread the love

Related News