ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. కోల్‌కతా వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 సార్లు తలపడగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ 21, పంజాబ్ కింగ్స్ 11 మ్యాచుల్లో విజయం సాధించాయి. నేటి మ్యాచ్ కోసం కోల్‌కతా టీమ్‌లో స్టార్క్ స్థానంలో చమీర ఆడే అవకాశాలున్నాయి. మరోవైపు పంజాబ్ కెప్టెన్ ధవన్ తిరిగి తుది జట్టులోకి వచ్చే ఛాన్సుంది.
వరుస విజయాలతో దూకుడు మీద కనిపిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతగడ్డపై మరో విజయం సాధించేందుకు సిద్ధమవుతోంది. లీడ్‌లో భాగంగా శుక్రవారం ఈడెన్ గార్డెన్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా తలపడనుంది. బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించిన కోల్‌కతా ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరి సొంతగడ్డపై కోల్‌కతాను పంజాబ్ కింగ్స్ ఏ మేరకు నిలువరించనుందనేది ఆసక్తికరం.
పంజాబ్‌తో పోలిస్తే కోల్‌కతా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో నరైన్ మొదలుకొని ఫిల్ సాల్ట్, శ్రేయాస్ అయ్యార్, రసెల్‌లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఇక ఫినిషర్‌గా రింకూ సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. బౌలింగ్ మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదు. రూ. 24.75 కోట్లు వెచ్చించి కొన్న మిచెల్ స్టార్క్ పూర్తిగా విఫలమవుతున్నాడు. మరోవైపు పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌లో అనుకున్నంత మెరుపుల్లేవు. గాయం నుంచి కోలుకోని శిఖర్ ధావన్ కోల్‌కతాతో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సామ్ కరన్ మరోసారి జట్టును నడిపించనన్నాడు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమవుండడంతో అశుతోశ్ శర్మ, శశాంక్ సింగ్‌లపై మరోసారి అధిక భారం పడనుంది. వీరిద్దరి చొరవతో పంజాబ్ పలు మ్యాచ్‌ల్లో విజయం కోసం ఆఖరి వరకు పోరాడగలిగింది. బౌలింగ్‌లో రబాడ, సామ్ కరన్ సహా మిగతా బౌలర్లు కూడా అంతంతమాత్రంగానే రాణిస్తున్నారు.