ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల దగ్గరకొస్తున్న వేళ బీజేపీ పార్టీ బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరారు. 1992 నుంచి యూత్ కాంగ్రెస్ లో ఉన్న ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.