Trending Now

నటి కంగన గెలుపుపై లేడీ కమెడియన్ సెటైర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నటి కంగన ఎంపీగా గెలవడంపై లేడీ కమెడియన్ సోనాలి థాకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘రాబోయే 4 ఏళ్లు హిమాచల్‌లో హృతిక్ రోషన్ సినిమా షూటింగ్‌లు జరగవేమో’ అని సెటైర్ వేశారు. తాను హృతిక్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని కంగనా గతంలో చెప్పగా, దాన్ని హృతిక్ కొట్టిపారేయడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. దాన్ని ఉద్దేశిస్తూ తాజాగా సోనాలి జోక్స్ వేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో BJP నుంచి కంగన పోటీ చేశారు. నటి కంగన మండి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, సిట్టింగ్ ఎంపీ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌లపై కంగనా విజయం సాధించారు.

Spread the love

Related News