Trending Now

రక్తదానం మహోన్నతమైన అవకాశం..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 14 : అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని దివంగత కావేటి పోతమ్మ చారిటబుల్ ట్రస్టు నిర్మల్ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో క్రారం ప్రపంచ రక్త దాతల దినోత్సవం స్థానిక కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇప్పటివరకు ఎక్కువసార్లు రక్తం దానం చేసిన రక్తదాతలకు ఘనంగా సన్మానం చేశారు. ఇప్పటివరకు 91సార్లు రక్తదానం చేసిన గంగిశెట్టి ప్రవీణ్, 70 సార్లు రక్తదానం చేసిన యాటకారి సాయన్నలకు మెమొంటోలు, శాలువాలతో సత్కరించడం జరిగింది. ప్రవాస భారతీయుడు శ్రీ కావేటి శ్రీనివాస్ రక్తదాతల్ని ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు మధుసూధన్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. రక్త దాన ప్రాముఖ్యతను వివరించారు. సన్మాన గ్రహీతల సేవా తత్పరతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయిడి రమేష్, శ్రీరాముల శ్రీనివాస్,సాధం ఆనంద్, రామారావు, వ్యాయామ ఉపాధ్యాయులు భుమన్న, ఉపాధ్యాయులు అత్తరొద్దిన్, నారాయణ, విశ్వనాథ వర్మ, శ్రీనివాస చారి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ మానవత్వంతో రక్త దాతలైన యాటకారి సాయన్న, గంగిశెట్టీ ప్రవీణ్‌లు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో నృత్య పోటీలలో రవీంద్రభారతిలో ప్రథమ బహుమతి సాధించిన అక్షిత అనే విద్యార్థిని ఘనంగా సన్మానించారు.

Spread the love

Related News

Latest News