ప్రతిపక్షం, ఎల్బీనగర్ ఏప్రిల్ 5 : ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జి మధు యాస్కీగౌడ్ పేర్కొన్నారు. వనస్థలిపురం సుష్మ రైతు బజార్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యాలయాన్నిమధుయాస్కీ గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో తాను ప్రజలను కలిసి సమస్యలు పరిష్కరిస్తానన్నారు.