ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ టారిఫ్ రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రిలయన్స్ జియో రీఛార్జి రేట్లను 12-15 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఎయిర్‌టెల్ కూడా టారిఫ్‌లపై 11-21 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. రూ.179ను రూ.199కి, రూ.299ను రూ.349కి, రూ.399ని రూ.499కి, రూ.455ను రూ.509కి పెంచింది. జూలై 3 నుంచి పెంపు వర్తించనుంది.
అంబానీపై ట్రోల్స్.. ‘కొడుకు పెళ్లి ఖర్చును మా మీద వేస్తున్నావా?’
రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘కొడుకు పెళ్లి ఖర్చు మొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీ మావా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘ఎన్నికలు అయిపోయాయి కదా ఇక బాదుడే బాదుడు’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య జియో సిగ్నల్ కూడా సరిగా రావట్లేదని ఫైరవుతున్నారు.