ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 13: మండల్ కమిషన్ సిఫారసుల అమలుకోసం ఐక్యంగా ఉద్యమిద్దాం అని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బీపీ మండల్ 42వ వర్ధంతి సందర్భంగా.. సిద్దిపేట బీజేఆర్ చౌరస్తాలో వివిధ ప్రజాసంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీపీ మండల్ కమీషన్ సిఫారసులను యధావిధిగా అమలుకోసం ఈ రోజు దేశ వ్యాప్తంగా అనేక ప్రజాసంఘాలు, సామాజిక సంస్థలు విడివిడిగా ఉద్యమాలు చేస్తున్నారన్నారు. కానీ, రిజర్వేషన్ వ్యతిరేకులు మాత్రం ఐక్యంగా మతం పేరుతో మనల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. కావున మనం ఉత్పత్తి సేవా కులాల, శ్రామిక కులాల, అణగారిన వర్గాల ప్రజల్నిసమీకరించి ఐకమత్యంతో ఉద్యమించడమే కర్తవ్యం గా ముందుకు సాగాలని అన్నారు.
ఏప్రిల్ మాసమంతా మహనీయుల జయంతులు, వర్ధంతులతో వారి త్యాగాలు, ఆశయాల స్మరణతో నడుస్తుందని, ఈ సందర్బంగా నిర్థిష్ట కార్యాచరణ ద్వారా సామాజిక విప్లవ లక్ష్యాన్ని సాధిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మామిండ్ల ఐలయ్య యాదవ్, అలకుంట మహేందర్, బెల్లె రాములు, పయ్యావుల రాములుయాదవ్, బొల్లు రాముయాదవ్, రాజబోయిన పర్షరాములు, శ్రీనివాస్ గౌడ్, పయ్యావుల మల్లేశం, చింతల మల్లేశం పోచబోయిన శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.