ప్రతిపక్షం, హుస్నాబాద్ ఏప్రిల్ 11: ఫూలే ఆశయాలను కొనసాగిద్దామని.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా దళిత, బహుజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారతదేశంలో మనువాద సిద్ధాంతం అంటరానితనాన్నిపెంపొందించింది అని అన్నారు. ప్రజలలో సామాజిక అసమానతలకు బ్రాహ్మణీయ భావజాలమే ప్రధాన కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.
మనదేశంలో మోడీ రూపంలో పెను ప్రమాదం పొంచి ఉందని అన్నారు. దేవుడి ముసుగులో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర పన్నుతోందని అన్నారు. ఈ దేశంలో మరో సారి మోడీ ప్రధాని అయితే లౌకికవాదం, ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేకల వీరన్న యాదవ్ తో పాటు దళిత బహుజన ప్రజాసంఘాల నాయకులు కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, పచ్చిమట్ల రవీందర్ గౌడ్, ముక్కెర సంపత్ కుమార్, కౌన్సిలర్లు వల్లపు రాజు, భుక్య సరోజన, బంక చందు ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్, ఎగ్గోజు సుదర్శన చారి, కైలు నాయక్, కిష్టస్వామి, వెన్నరాజు, కొయ్యడ కొమురయ్య, పెరుమాండ్ల నర్సా గౌడ్, సావుల కోటేశ్వరరావు, మార్క అనిల్ గౌడ్, బూట్ల రాజ మల్లయ్య, గంపల శ్రీనివాస్, దూబల శ్రీనివాస్, బొల్లి శ్రీనివాస్, హరిబాబు, బిక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.