Trending Now

మనువాదాన్ని ఓడిద్దాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 12: మనిషిని మనిషిగా చూడని నిరాకరించిన మనువాదాన్ని ఓడించి ప్రజలందరికి స్వేచ్చ, సమానత్వం, సోదరభావం, సామాజిక ఆర్ధిక, రాజకీయ న్యాయన్ని అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకొవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. డిబిఎఫ్ అధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రచారోద్యమ సదస్సు శుక్రవారం నాడు మెదక్ లోని కేవల్ కిషన్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. మహనీయులైన పూలే, అంబేద్కర్, జగ్ జీవన్ రామ్ ల జయంతుల మహత్సోవం సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ ప్రచారోద్యమాన్ని చెపట్టామని శంకర్ తెలిపారు.

విద్య, ఉద్యోగం, ఆస్తులు, సంపదలను రాజకీయ అధికారాన్ని అణగారిన వర్గాలకు మనువాదం దూరం చేసిందన్నారు. మానవ హక్కులను అందించిన రాజ్యాంగాన్ని 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని పదే పదే ప్రకటిస్తున్న కేంద్ర మంత్రుల కుట్రలను అర్ధం చేసుకొని రానున్న పార్లమెంటు ఎన్నికలలో బీజేపీని ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకొవాలన్నారు. ఈ గత పదెళ్ళుగా మోడీ ఇచ్చిన ఏ హమీని నేరవెర్చలేదన్నారు. అలాగే మెదక్ పట్టణంలో ముందుగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తీసివేసి ఇప్పటివరకు స్థాపించకుండా ఉండడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే మెదక్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేశం, దళిత నేతలు రామస్వామి, MRPS నాయకులు బాల్ రాజు, BC సంఘం నాయకులు మొహన్, సంజివ్, ఇసాక్, డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మకొండ దయా సాగర్, జర్నలిస్టు నాగరాజు, రాయిన్ పల్లి నీరుడు నర్సింలు, పొషయ్య, కుమార్, ప్రభు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News