Trending Now

రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుందాం..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అల్లూరి మల్లా రెడ్డి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 6 : నిర్మల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అల్లూరి మల్లా రెడ్డి ఈ రోజు నిర్మల్ మండలం ఎల్లారెడ్డి పెట్ గ్రామం, మామడ మండలంలోని బూరుగుపల్లి, కిషన్ రావు పేట్ గ్రామాలలో ఇంటింటి, ఉపాధి హామీ పనుల వద్ద ప్రచారము నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి గా చేయవలసిన అవసరం మనందరిపైన ఉన్నదన్నారు. నెహ్రూ, గాంధీ కుటుంబాలు త్యాగాల కుటుంబాలని.. రాజీవ్ గాంధీ మరణించిన నాటి నుండి ఆ కుటుంబం ప్రధాని పదవి చేతికి వచ్చినా తీసుకోకుండ త్యాగం చేసిన ఘనులు అన్నారు. ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ను ప్రధాన మంత్రి గా చేసి మన దేశ భవిష్యత్తును కాపాడిడారని, ఇప్పుడు భారత దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరి పై ఉందని పేర్కొన్నారు.

అందుకోసం మన భారత రాజ్యాంగను కాపాడే నాయకుడు రాహుల్ గాంధీ గారు మాత్రమే కనుక కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేసి ఆత్రం సుగుణ ఎంపీగా గెలిపించగలరని కొరారుప ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ నాయకులు సూర్యకాంత్, ST సెల్ జిల్లా అధ్యక్షుడు బాణావత్ గోవింద్, రియల్ ఎస్టేట్ సత్యనారాయణ, బంగల్ పేట్ వంశీ, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News