Trending Now

Pawan: సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకోం.. డిప్యూటీ సీఎం పవన్

Let’s not sit back if Sanatana Dharma comes into play.. Deputy CM Pawan: సనాతన ధర్మం జోలికి ఎవరు వచ్చినా వారిని వదలిపెట్టమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ప్రాయశ్చిత్త కార్యక్రమంలో భాగంగా ఆయన ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతోంది. ఇప్పటికీ వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. సున్నిత అంశాలపై ఆ పార్టీ నేత పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యలు బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో పొగరుగా మాట్లాడితే ఊరుకునేది లేదు.’ అన్నారు. మరోవైపు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై కూడా పవన్ ఫైరయ్యారు. సనాతన ధర్మంపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఊరుకునేది లేదని ఘాటుగా స్పందించారు. సినిమా ఫంక్షన్లలో కూడా సనాతన ధర్మంపై జోకులు వేస్తున్నారని ఇలాంటి సహించే పరిస్థితే లేదని మండిపడ్డారు.

Spread the love

Related News

Latest News