Trending Now

చిన్నారుల బాల్యాన్ని కాపాడుదాం: ఎస్పీ జానకి షర్మిల

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూలై 01: జూలై మొదటి తారీఖు నుండి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ 10 వ విడతలో భాగంగా నిర్మల్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలకు చెందిన చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ ప్రోటెక్షన్, రెవన్యూ, విద్యా, వైద్యా, లేబర్, విభాగాలకు చెందిన అధికారులతో పాటు సూర్య నారాయణ అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణ లో భరోసా సెంటర్ ఇంచార్గ్ అధికారి జ్యోతిమని ఎస్ ఐ సోమవారం పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్కాన్ పదవ విడత గోడ ప్రతిని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. తప్పిపోయిన, వదిలేయబడిన, నిర్లక్షం చేయబడిన, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న, బాల కార్మికులుగా పనిచేస్తున్న 18 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.

జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్ 100 కి గాని, 1098 చైల్డ్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు గాని ఫోన్‌ చేసి సమాచారం అందించే విధంగా ప్రజల్లో అవగాహన పెంచాలని, ఇకపై రానున్న రోజుల్లో బాలకార్మికుల నిర్మూలకై ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని నిర్వహించబడేందుకుగాను ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రతినెల ఒకోక్క రంగాన్ని ఎంచుకోని ఆయా రంగాల్లో పనిచేసే బాలకార్మికులను గుర్తించి వారిని వెట్టిచాకీరి నుండి విముక్తి కలిగించాలని, ముఖ్యంగా చిన్నారులతో వెట్టిచాకిరి చేయించుకోవడం చట్యరీత్యానేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ప్రజలకు సూచించారు.ఈ సమావేశంలో సోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, ఎస్.ఐ జ్యోతిమని, జిల్లాలో గల చైల్డ్ వెల్ఫేర్, లేబర్ శాఖ, ఏసీఎల్, సి డబ్ల్యూ సిడీసీపీవో,, సీపీవో, ఏ.హెచ్.టి.యు సిబ్బంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News