Trending Now

లిక్కర్ కేసు.. పిటిషన్ విత్ డ్రా చేసుకున్న ఎమ్మెల్సీ కవిత

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ను కవిత ఉపసంహరించుకున్నారు. గత ఏడాది మార్చి 14న కవిత రిట్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో ఈరోజు వాదనల సందర్భంగా కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదనలను వినిపిస్తూ.. రిట్ పిటిషన్ పై విచారణ అవసరం లేనందున పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో, పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం అంగీకరించింది. మరోవైపు, కవితను ఈడీ అరెస్ట్ చేయడం అక్రమమంటూ దాఖలైన మరో పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయింది.

Spread the love

Related News

Latest News