పలు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరిన ఓటర్లు
ప్రతిపక్షం, స్టేట్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. అన్ని స్థానాలకు ఈ 4వ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. ఎండలు, వర్షం భయం కారణంగా.. త్వరగా ఓటేస్తే మంచిదని అభిప్రాయపడుతున్న తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. అన్ని స్థానాలకు ఈ 4వ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. ఎండలు, వర్షం భయం కారణంగా.. త్వరగా ఓటేస్తే మంచిదని అభిప్రాయపడుతున్న జనాలు.. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు.
ఓటేసిన ప్రముఖులు..
సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో మెగాస్టార్ చిరంజీవి, అల్లూ అర్జున్, ఎన్టీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, ఇతర ప్రముఖులంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్టీఆర్, అల్లూ అర్జున్, చిరంజీవి దంపతులు, డైరెక్టర్ తేజ ఇతర ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాని చేరుకుని ఓటు వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైట్స్ వోట్ వేశారు. షాద్నగర్ టౌన్లోని గంజ్ లో పోలింగ్ బూత్ వద్ద బారులు తీరారు. మిగిలిన చోట్ల మండ కోడిగా పోలింగ్ జరుగుతోంది.