ప్రతిపక్షం, నిర్మల్ జిల్లా, మార్చి 28 : బాసర రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య కలకలం లేపింది. బుధవారం రాత్రి నాగర్సోల్ నుండి నర్సాపూర్ వెళ్లే ట్రైన్ కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కు పాల్పడ్డారు. మృతురాలు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యువతిగా గుర్తించగా.. నిషిత డిగ్రీ కాలేజీలు చదువుతున్నట్లు ఐడి కార్డు ద్వారా తెలుస్తోంది. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.