ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPL-2024లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30కు ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు టీమ్‌లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా, 3 మ్యాచుల్లోనూ LSG గెలిచింది. ప్రస్తుత సీజన్ పాయింట్స్ టేబుల్‌లో లక్నో 3 విజయాలతో మూడో స్థానంలో ఉండగా, ఢిల్లీ ఒక్క విజయంతో చివరి స్థానంలో ఉంది.